చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు సోమవారం అంబేద్కర్ కొనసీమ జిల్లా అంబాజీపేట జంక్షన్‌లో నిర్వహించిన ప్రచార సభలో సీ.ఎం. జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి. అబ్యార్ది రాపాక వరప్రసాద్, ఎమ్మెల్యే అబ్యార్ది విప్పర్తి వేణుగోపాలరావు, గొల్లపల్లి సుర్యరావు,పినిపి విశ్వరూప్ పలువురు పార్టి నాయకులు కార్యకర్తలు అదిక సంఖ్యలో పాల్గొన్నారు.

