రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభిం. అందులో భాగంగా ఇప్పటి వరకు అందించిన స్థలాలను రిజిస్ట్రేషన్స్ చేయడం కొరకు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు.
భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. సాయి ప్రసాద్ అమరావతి నుండి 26 జిల్లాల కలెక్టర్లు, జే.సీ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఇప్పటివరకు అందించిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ కొరకు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… స్థలాల మ్యాపింగ్ పూర్తి చేయాలని, ఇండ్ల స్థలాల లబ్ధిదారుల పేర్లు ఎదురుగా ప్లాట్ నెంబరు సర్వేనెంబర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అదేవిధంగా సరిహద్దుల వివరాలు పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు. భూ సేకరణ సెక్షన్ సూపరింటెండెంట్ పి. సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

