ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ వారాహి ఏకాదశ దిన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. వారాహి అమ్మ వారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దీక్షాబద్ధులైన ఆయన వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతి, ద్వి హారతి, త్రి హారతి, చతుర్ధ, పంచ, నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా కుంభ హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణం అయ్యిందని ఆయన అన్నారు. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ్ శర్మ, వేణుగోపాల శర్మ పూజా క్రతువు పూర్తి చేసి ఆశీర్వచనాలు అందచేశారు.
వారాహి దీక్షోద్వాసన గావించిన పవన్ కళ్యాణ్…

