Political

వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ…

th (13)

కీలకమైన లోక్‌సభ పోటీకి ముందు వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలి. వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డి.సి.సి. ప్రధాన కార్యదర్శి పి.ఎం. సుధాకరన్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వయనాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ ఆ పార్టీ జిల్లా నేతలకు కూడా అందుబాటులో లేరని అన్నారు. రాహు గాంధీ ఎం.పీ. వ్యక్తికే అందుబాటులో లేనప్పుడు ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని అన్నారు.

అతనికి ఐదేళ్లు గడువు ఇచ్చారు. మేము మరో టర్మ్ ఇస్తే అది వాయనాడ్ అభివృద్ధి అవకాశాలను నాశనం చేస్తుందని సుధాకరన్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… ఇప్పుడు ఐక్యంగా ఉన్న ఇండియా కూటమిలో క్లిష్టమైన సమస్యలపై పెద్ద విభేదాలు తలెత్తాయని అన్నారు. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆమె అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.