ప్రభుత్వం దృష్టిలో అతను తప్పు చేసిన వ్యక్తిగా ముద్ర పడిన ప్రజల దృష్టిలో మాత్రం అతను దేవుడయ్యాడు. ఎంత సంపాదించిన కష్టకాలంలో ఉన్నవారికి అతను ఆర్థికంగా అన్ని రకాల అండగా నిలబడి నేనున్నానంటూ వారికి దేవుడయ్యా డు. తమిళనాడు రాష్ట్రంలో గతంలో జరిగిన సంఘటన నేటికీ వీరప్పన్ పుట్టినరోజును, చనిపోయిన రోజును అడవి పరిసర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మన ప్రాంతంలో కూడా వీరప్పన్ గురించి విన్నదే గాని అతనికి అభిమానులు ఉన్న విషయం ఎవరికీ తెలియదు ప్రస్తుతం శాంతిపురం మండలం అపకల దొడ్డి గ్రామపంచాయతీ కాకర్ల వంక లో వీరప్పన్ జ్ఞాపకార్థం స్థూపం ఏర్పాటు చేసారు.
అతని పుట్టినరోజు చనిపోయిన రోజును ఆ ప్రాంతంలో ఉన్న వన్నెకుల క్షత్రియులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమకు తమ కులానికి వీరప్పన్ ఆరాధ్య దైవం అని నేటికీ ఆ ప్రాంత వాసులు అతనిని దేవుడిగా చూస్తూ సమాజంలో కూడా అతనికి ఒక ఉన్నత స్థానం ఏర్పాటు చేశారు. స్థానిక గ్రామానికి పర్యటన నిమిత్తం వెళ్లిన చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ వైఎస్ఆర్సిపి స్తూపం ఆవిష్కరణ చేసి అనంతరం వన్నెకుల క్షత్రియులు ఇతరులు పట్టుబట్టి వన్నెకుల ఆరాధ్య దైవం వీరప్పన్ చిత్రపటంతో ఏర్పాటు చేసిన స్థూపంను వన్నెకుల క్షత్రియ పతాకాన్ని ఆవిష్కరింపజేశారు. ఏదేమైనా ప్రజలు దృష్టిలో దేవుడయ్యాడు ఇది వీరప్పన్ కి ప్రజలు నీ రాజనాలు పలుకుతున్నారు.
