2024 నూతన సంవత్సర వేడుకల దృష్య పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు రద్దీగా ఉండే అవకాశముందని రాబోయే 10-15 రోజుల్లు పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ ఆధేశించారు. కొత్త సబ్ వేరియంట్ జే.ఎన్..1 వల్ల వచ్చే కేసులను గుర్తించే దృష్ట్యా కరోనావైరస్ పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారని కానీ పెద్ద సమావేశాలలో, ఇది వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని అన్నారు హెచ్చరించారు. కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తిని తనిఖీ చేయడానికి ఆరోగ్య సంస్థలు, ప్రజలు రాబోయే 10-15 రోజులు అప్రమత్తంగా ఉండాలి.
వచ్చే 10-15 రోజులు అప్రమత్తంగా ఉండాలి… -మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి-
