Exclusive

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చర్యలు తప్పవు… -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-

WhatsApp Image 2023-11-30 at 9.45.57 PM

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధిత చట్టం(పీ.సీ.పీ.ఎన్.డీ.టీ యాక్ట్), సహాయ పునరుత్పత్తి సాంకేతిక చట్టం (అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్), సరోగసి చట్టంల మీద జిల్లా మరియు ఉప జిల్లా స్థాయి అప్రా ప్రేయట్ అథారిటీలకు, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు నడిపే వ్యక్తులకు, జిల్లాలోని ఇతర డాక్టర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పీ. ఉమామహేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశానికి హాజరైనవారికి ఆయా చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి జీ. కేశవ వర్ధన్ రెడ్డి, రామచంద్రాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి సుధా సాగర్,జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దుర్గారావు దొర, తదితరులు పాల్గొన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.