Exclusive

లాల్ నీల్ ఐక్యతతోనే దళిత హక్కులు పరిరక్షిణ….

WhatsApp Image 2024-02-06 at 3.32.27 PM

కేంద్ర రాష్ట్ర పాలకులు దేశంలో దళిత బడుగు బలహీన వర్గాల వ్యతిరేక విధానాలు చేస్తున్నారని ఇటువంటి నేపథ్యంలో పేద ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు దళిత జాతి కోసం పోరాడే దళిత సంఘాలు లాల్ నీల్ ఏకమై పోరాడినప్పుడే దళిత హక్కులు పరిరక్షించబడతాయని ప్రముఖ న్యాయవాది బార్ మెంబర్ ముప్పాల సుబ్బారావు పిలుపునిచ్చారు.

మంగళవారం ఉదయం రాజమండ్రి కోర్టు ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి డి.హెచ్.పి.ఎస్. రాష్ట్ర డైరీను సుబ్బారావుతో పాటు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి.వి.బి. రాజు, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కవి హనుమంత రావు, న్యాయవాదులు శాఖ సురేష్, తదితరులు కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సామాజిక వివక్షలు రూపుమాపేందుకు సాగుతున్న ఉద్యమాలకు ఉద్యమ కరదీపిక గా ఈ డైరీ ఉపయోగపడుతుందన్నారు. వివిధ రకాల చట్టాలు, పరిపాలన విధానాలతో ఈ డైరీ రూపొందించబడిందన్నారు. దళిత ఉద్యమకారులకు ఎంతో ఉపయోగంగా ఉపయొక్తం గా ఉంటుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.