Viral

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు…

WhatsApp Image 2024-02-12 at 5.08.26 PM

రోడ్డు ప్రమాదాల్లో అపారమైన ప్రాణ నష్టం, ధన నష్టం కలుగుతుందని రహదారులపై ప్రయాణించే ప్రయానికులందరూ భద్రత నియమాలు పాటించడం ద్వారా చాలా ప్రమాదాలను అరికట్టవచ్చని మోటార్ వెహికల్స్ ఇన్స్పిక్టర్ కె.వి.ఎస్. ప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లను ఉప రవాణా కమిషనర్ ఎస్. శాంతకుమారి అధ్వర్యంలో వట్లూరు సి.ఆర్. రెడ్డి మహిళా కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జీబ్రా గుర్తు వున్నచోట మాత్రమే రోడ్డు దాటాలని, ఫుట్ పాత్ లేని చోట్ల రోడుకు కుడి వైపున నడవాలని తెలిపారు. వాహనాలు నడుస్తున్నపుడు రోడ్డు మధ్యలో వుండే కట్ట నుంచి బయటకు అడుగు పెట్టడం చాలా ప్రమాదకరమని చెప్పారు. రోడ్డు మలుపులు దాటేప్పుడు ఎక్కువ జాగ్రత్త వహించాలని సూచించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.