కేంద్ర ప్రభుత్వం రైళ్లకు జనరల్ భోగీలు పెంపు చేయకపోవడం వలన పేద, సామాన్య, మధ్య తరగతి ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులుకలుగుతున్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్వాతంత్ర్యం కాలం నాటి 39 కోట్లజనాభా ప్రకారం ప్రతి రైలుకు రెండు జనరల్ భోగీలు కేటాయించగా దేశ జనాభా 142 కోట్లకు చేరినా అవే రెండు భోగీలు కొనసాగుతున్నాయని అన్నారు. వృద్దులు, గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు మరియు చంటిపిల్లలు జనరల్ భోగీల్లో ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటంలా మారిందని వారన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా దేశవ్యాప్తంగా అన్ని రైళ్లకు అదనంగా మరో రెండు జనరల్ భోగీలు కేటాయించాల్సిన బాధ్యత వుందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో జాతీయరైల్వే ప్రయాణం పై సామాన్యులకు భరోసా కల్పించక పోవడం తగదన్నారు. ప్రాంతీయ పార్టీలు ప్రజాహితపక్షం వహించకుండా జాతీయ పార్టీల కు పల్లకీ మోసే కూలీలు కావడం ప్రజల దౌర్భాగ్య మన్నారు.
రైల్వే సేవలు మ్యానిఫెస్టోలో ప్రకటించాలి… -పౌరసంక్షేమసంఘం-

