రైల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణీకుడికి 55 శాతం రాయితీ లభిస్తుందని, సీనియర్ సిటిజన్లు, మీడియా వ్యక్తులకు ప్రీ-కోవిడ్ ఛార్జీల రాయితీలను పునరుద్ధరించాలనే డిమాండ్ల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆయన అహ్మదాబాద్‌లో కొనసాగుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిని సంబందిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మీడయా తో మాట్లాడుతూ… వారు అడిగిన ప్రశ్నలకు ఎటువంటి ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా భారతీయ రైల్వే ఇప్పటికే ప్రతి రైలు ప్రయాణీకుడికి రైలు ఛార్జీలపై 55 శాతం రాయితీని అందిస్తోందని అన్నారు.
అంతకుముందు మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన RTI దరఖాస్తుపై స్పందిస్తూ… భారతీయ రైల్వే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుండి సుమారు రూ. 2,242 కోట్లు ఆర్జించిందని అన్నారు. మార్చి 2020లో విధించిన COVID-19 లాక్‌డౌన్‌కు ముందు రైల్వే సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైలు ఛార్జీలపై 50 శాతం రాయితీని అందించిందన్నారు.

