రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా కోరుకుంటోందని కాంగ్రెస్ నేత, అమేథీ ఎం.పీ. కిశోరీ లాల్ శర్మ అన్నారు. ఖర్గే జీ మా నాయకుడు, ఇది మా సమిష్టి కోరిక, అలాగే పార్టీ కోరిక అని ఆయన అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇటీవల చేసిన తీర్మానాన్ని అనుసరించి లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని వర్గాలు సూచించినట్లు నివేదికలు వెళ్లడించాయి.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక కావడం పట్ల కిషోరి లాల్ శర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆమె మార్గదర్శకత్వంలో నేను పార్లమెంటులో ఎం.పీ. గా పని చేస్తాన్నారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సీ.పీ.పీ. సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు.

