జూలై 8, 9, 10 వ తేదీలలో కాకినాడలోని సూర్యకళమందిరంలో జరగనున్న ఏ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు, ఎస్.టీ.యూ. రాష్ట్ర నేత పి. సుబ్బరాజు పిలుపునిచ్చారు. నేడు ఉదయం స్థానిక ఎస్.టీ.యూ. కార్యాలయములో జరిగిన సమావేశనాకి ముఖ్య అధితిగా పాల్గున్న పి. సుబ్బరాజు, ఏ.ఐ.వై.ఎఫ్. మాజీ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడతూ… కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం పై దేశ వ్యాప చర్చ జరగాలని వారు కోరారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యుజి ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారితంగా వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి…

