ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ టీ.డీ.పీ. అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రివర్గంలోకి రావడంతో, 95 వేల ఓట్ల రికార్డు మెజారిటీతో గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లాను టీ.డీ.పీ. రాష్ట్ర అధ్య క్షుడిగా నాయుడు నియమించారు.
విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ అధ్యక్షుడిగా పల్లా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని, రాష్ట్ర టీ.డీ.పీ. చీఫ్‌గా తన కొత్త బాధ్యతను చక్కగా నిర్వహిస్తారనే విశ్వాసాన్ని నాయుడు వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించడంలో అచ్చెన్నాయుడు చేసిన కృషిని కొనియాడిన టీ.డీ.పీ. అధిష్టానం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు, తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేసేందుకు మాజీలు ఎంతో కృషి చేశారని అన్నారు.
