డిసెంబర్ 4 లేదా 5 తేదీల్లో ఓ తుపాను ఏపీ తీరానికి సమీపిస్తుందని ఐ.ఎం.డి. వివరించింది. ఈ నెల 1వ తేదీ నుంచి దీని ప్రభావం చూపించనున్నట్లు తెలిపింది. దీని కారణంగా పలు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐ.ఎం.డి. తెలిపింది. ఈ తుఫాన్‌కు ” మిఛౌంగ్ ” అని పేరు పెట్టినట్లు చెప్పింది. మయన్మార్ ఈ పేరును సూచించిందని ఐ.ఎం.డి. వివరించింది. ఈ ఏడాదిలో బంగాళాఖాతంలో ఏర్పడబోయే నాలుగో తుఫాన్ ఇదే అవుతుందని హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో ఇప్పటివరకు ఆరు తుఫాన్లు ఏర్పడ్డాయని ఐ.ఎం.డి. తెలిపింది.
రాష్ట్రానికి “మిఛౌంగ్” తుపాన్….