Political

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మూడు ప్రధాన పార్టీలు… -సీ.పీ.ఎం. నేతలు లోకనాథం, సీతారాం-

WhatsApp Image 2023-11-06 at 10.21.59 PM

కేంద్రంలోని బీ.జే.పీ. ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలైన వై.సీ.పీ., టీ.డీ.పీ., జనసేనలు ప్రశ్నించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని సీ.పీ.ఎం. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాధం, మంతెన సీతారాంలు ఆవేదన వ్యక్తం చేశారు. సీ.పీ.ఎం, ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర కాకినాడ చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విభజన హామీలు అమలు చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. బీ.జే.పీ. విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మతోన్మాద ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తూ సామాజిక సాధికారిక యాత్ర అని చెప్పడం తగదన్నారు. రిజర్వేషన్లు అనేవి కాగితానికే పరిమితం అయ్యాయని కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగానే ఉందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.