ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వై.ఎస్.ఆర్. ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుందని తెలిపింది. ఇప్పటికే దీనికి అవసరమైన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోన్నారని సంబందిత అధికారులు వివరించారు. క్యాంప్ కార్యాలయంలో వైద్య- ఆరోగ్య మంత్రిత్వ శాఖపై వై.ఎస్. జగన్ నిర్వహించిన సమీక్ష అధికారులకు పలు ఆదేశాలను జారీచేసారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పై, ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డును ఎలా వినియోగించుకోవాలో తెలియని వారు ఉండకూడదని జగన్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ కార్యాక్రమం… -ముఖ్యమంత్రి వెల్లడి-
