రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షునిగా అడపా సోమేశ్వరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాయల్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగల వీరాంజనేయులు ఆదేశాలతో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కావలి కృష్ణ తేజ అడపాకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆ నియామక లేఖలో వీరాంజనేయులు, కృష్ణతేజలు ప్రస్తావిస్తూ… సోమేశ్వరరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో ఆయన్ని గుర్తించామని అందువల్ల కాకినాడ పార్లమెంట్ అధ్యక్షునిగా నియమించినట్లు చెప్పారు. తెలగ, బలిజ, కాపు సామాజిక వర్గీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడపా పరిష్కరించేలా పనిచేయాలని వీరాంజనేయులు, కృష్ణ తేజలు సూచించారు.
ఈ సందర్భంగా అడపా సోమేశ్వరరావు మాట్లాడుతూ… తన మీద ఉంచిన నమ్మకంతో పనిచేసే ఆ పదవికి వన్నెతెస్తానన్నారు. తమ కాకినాడ పార్లమెంటు పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో యువజన, మహిళా కమిటీలను నియమించి కాపు సామాజిక వర్గీయులను బలోపేతం చేస్తానని చెప్పారు. ప్రస్తుతం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన వారికి కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో సమస్యలు ఎదరవుతున్నాయని వాటిని అధిగమించి ఆ పత్రాలు వారికి చేరేలా తన వంతు సహకరిస్తానని అడపా సోమేశ్వర రావు తెలిపారు.

