Exclusive

రాయచోటి లో విషాదం… సెంట్రీ డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ మృతి…

9e1b518f-cfd8-423c-b991-4847051aabe9

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న 26 సంవత్సరాల వేదవతి అనే మహిళా కానిస్టేబుల్ గన్నుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే గన్నుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక గన్ను మిస్ ఫైర్ అయ్యి మృతి చెందిందనే విషయము తెలియాల్సి ఉంది.

భర్త పేరు దస్తగిరి ఆయన సొంత ఊరు మదనపల్లి. వేదవతి సొంత ఊరు పుంగనూరు దగ్గర బింగానిపల్లె అని అధికారులు తెలిపారు. దస్తగిరి పుంగనూరులో పోలీస్ అకాడమీ కోచింగ్ సెంటర్ లో ప్యాకల్టీగా పనిచేస్తూ అక్కడ వేదవతి ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఇద్దరు ప్రేమించుకుని 2016 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.

వేదవతి చిత్తూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తూ సంవత్సర క్రితం బదిలీపై అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చింది. ప్రస్తుతం దస్తగిరి తో కలిసి వేదవతి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహకు పక్కనగల ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు డిఎస్పి రామచంద్రరావు, అర్బన్ సీ.ఐ. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేదవతి మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.