బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో ఇటీవల భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ కేసుకు సంబందించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుందని వెళ్లడించారు. బళ్లారిలోని కౌల్ బజార్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అనే వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో తనని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.పేలుడు గురించిన సమాచారం షబ్బీర్ కు తెలిసి ఉండవచ్చని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది మరియు అతని ఇటీవలి ప్రయాణ చరిత్ర ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారని వారు తెలిపారు.
రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో షబ్బీర్ అరెస్ట్…

