డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న అంబేత్కర్ గురుకుల పాఠశాలలో మధ్యాహన బోజనం కలుషితం కావడంతో అది తిన్న 52 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని పీ.డీ.ఎస్.యు. నాయకులు బి. సిద్ధూ కోరారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వి. నాగేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక ఆదివారపుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల రక్తపు విరోచనాలు, విరోచనాలు, వాంతులుతో 52 మంది విద్యార్థులు ద్రాక్షారామం ఆసుపత్రిలో చేరారన్నారు. వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నాన్నారు. ప్రభుత్వం వెంటనే నాణ్యత కలిగిన ఆహారం విద్యార్థులకు అందించాలని, లేని పక్షంలో విద్యా ర్థులతో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
