Kakinada

రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించే కుట్ర…

WhatsApp Image 2024-01-23 at 8.01.21 PM

రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి హిందూ దేశంగా ప్రకటించాలని బి.జె.పి. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ క్రైస్తవ, ముస్లిం మతాల నాయకులు ఫిబ్రవరి 10న కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్ నందు బహిరంగ సభను నిర్వహించనున్నారని ప్రకటించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేయడినికి తీర్మానించామని హైకోర్టు న్యాయవాది, ఆంధ్ర రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షణ సభ చీఫ్ కోఆర్డినేటర్ దొమ్మేటి సుధాకర్ ఆన్నారు. మంగళవారం సివైఎఫ్ ప్రధాన కార్యాలయంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బీహెచ్.వి మూర్తి రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సంధర్బంగా జిల్లాలోని క్రైస్తవ, ముస్లిం నాయకులందరూ నిరసన ప్రదర్శన కార్యాచరణ నిర్ణయించుటకు ఈ నెల 25న గొడారిగుంట విడుదల టెంపుల్ లో నాయకుల సదస్సు నిర్వహించదడానికి తీర్మానించినారు. ఈ కార్యక్రమంలో మెక్లారిన్ హై స్కూల్ రిటైర్డు హెడ్ మాస్టర్ డి.సుధాకర్ ,జాన్ వీక్లీప్ ,శ్రీనివాస్ ,నాని బాబు ,నానాజీ ,అడ్వకేట్ జి .ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ