కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరుఫున ప్రచారం చేసేందుకు విచ్చేసిన ప్రముఖ మెగా సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ కి శనివారం రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చిరంజీవి యువత అభిమాన సంఘాల నాయకులు ధర్మేంద్ర, ఏడిద బాబీ నేతృత్వంలో అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి గజమాలతో ఆయకు స్వాగతం పలికారు. వరుణ్ తేజ్ గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు పెడతారన్నారు. అనంతరం వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారని ఈ సందర్బంగా తెలిపారు. ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తారని వెళ్లడించారు.
రాజమండ్రి విమానాశ్రయంలో మెగా హీరోకు ఘన స్వాగతం…

