రాజమండ్రి ఏడిబి రోడ్డులో ట్రాలిపై వెళ్తున్న రెండు కాంక్రీట్ మిక్సర్ వాహనాలలో మంటలు చెలరేగు కలిపోయాయి. కాకినాడ నుండి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెల్సుకున్న అగ్నిమాపక సిబంద్ధి వెంటనే రెండు అగ్నిమాపక శకటాలతో ప్రమాదం జరిగిన చోటికి వెళ్లి ఆ మంటలను ఆపారు. ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆక్కడ ఉన్నవారందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో ఏడిబి రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి గల కారణాలపై పెద్దాపురం పోలీసులు ఆరా తీస్తున్నారు.
రాజమండ్రి ఏడిబి రోడ్డులో వాహనాలు దగ్ధం….
