ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పరిశ్రమ కార్మికుల సమ్మె, ట్రాన్స్పోర్ట్ సమ్మె విజయవంతమైంది. ఉదయం 5 గంటల నుండి కాకినాడ సి పోర్ట్ వద్ద పారిశ్రామిక సమ్మె చేపట్టారు. అనంతరం కోరమండల్, ప్యారి సుగర్, తదితర ఆయిల్ కంపెనీలు, పలు సంస్థల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రవాణా రంగాన్ని స్థంభింపచేసిన కార్మికులు…

