రాష్ట్రంలో అంగన్వాడీలు గత 37 రోజులుగా నిరవధికంగా, విశ్రాంతి లేకుండా వారి డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ వినతి పత్రం ద్వారా కేంద్ర మహిళా శిశు సంక్షేమం అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ముంజుపారా మహేంద్ర బాయ్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వికసిత్ భారత్ సంకల్పయాత్ర లో భాగంగా జిల్లాలో పర్యటించి రాత్రి కాకినాడలో బస చేశారు .
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్, గట్టి సత్యనారాయణ, దువ్వూరి సుబ్రహ్మణ్యం, తదితరులు మంత్రిని కలిసి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణి నీ వివరిస్తూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ మాట్లాడుతూ… అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై కేంద్రమంత్రి పరపతిని ఉపయోగించాలని అన్నారు.

