ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ప్రశంసలు కురిపించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో బీ.జే.పీ. ని సగం సీట్లతో ఆపడంలో సీ.ఎం. యోగి పెద్ద పాత్ర పోషించారని రషీద్ అల్వీ పేర్కొన్నారు. రషీద్ అల్వీ మాట్లాడుతూ… నేను సీ.ఎం. యోగిని అభినందించాలనుకుంటున్నానన్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిజాయితీగా పనిచేశారు. రాంపూర్‌లో ఆయన ఎలా ప్రయోగించారో, ఈ ఎన్నికల్లో ఆ పని చేయలేదన్నారు. అందుకే ఓటర్లు పూర్తి బలంతో బీ.జే.పీ. కి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. గతంలో వచ్చిన సగం సీట్లతో బీ.జే.పీ. ని ఆపడంలో ముఖ్యమంత్రి పాత్ర చాలా పెద్దదన్నారు.
యోగి ఆదిత్యనాథ్‌ను అభినందించిన రషీద్ అల్వీ…

