యూనివర్సల్ మెగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటిసారి రెండవ ప్రపంచ కప్ యోగా పోటీలలో కాకినాడకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంస్య సిల్వర్ పథకాలను కైవసం చేసుకున్నారు. డిసెంబర్ 16 న్యూఢిల్లీలో జరిగిన ఈ యోగా పోటీలలో పాల్గొన్న కంబాల భాస్కర వెంకట శివ సాయిరాం అండర్ 16-18 విభాగంలో పోటీపడి సిల్వర్ పథకాన్ని సొంతం చేసుకున్నాడు.
అండర్ 9-11 విభాగంలో గంపల లహరి దుర్గ తలపడి కాంస్య పథకాన్ని సాధించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ ఇరువురి యోగ క్రీడాకారులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇరిగేషన్ సూపరిండెంట్ సత్య అందించిన సహకారంతో ఈ పోటీలలో పాల్గొని విజేతలగా నిలిచేందుకు అవకాశం కలిగిందని ఏపీ పీఠం రాష్ట్ర అధ్యక్షులు చిట్టూరి చిట్టిబాబు తెలిపారు.

