Viral

యూ.పీ. లో మోసపోయిన మహిళా పోలీస్… బయటపడ్డ నిజం…!!!

BB1i81F4

ఉత్తరప్రదేశ్‌లో మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారిణి ని ఐ.ఆర్‌.ఎస్. అధికారిగా నటించి మోసంచేసి పెళ్లి చేసుకొని లక్షల రూపాయల మేర దోచుకున్నాడు. 2012-బ్యాచ్ ఐ.పీ.ఎస్. అధికారిణి అయిన శ్రేష్ఠ ఠాకూర్ 2018లో మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయమైన రోహిత్ రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

తన పదునైన పోలీస్ నైపుణ్యంతో రోహిత్ రాజ్ రాంచీలో డిప్యూటీ కమిషనర్‌గా 2008-బ్యాచ్ ఐ.ఆర్‌.ఎస్.అధికారి అని తెలుసుకుంది. ఆ తర్వాత అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత ప్లాట్‌ ట్విస్ట్‌ తీసుకుంది. వివాహం తర్వాత శ్రేష్ట ఠాకూర్ తన భర్త అసలయిన ఐ.ఆర్‌.ఎస్. అధికారి కాదని తెలిసింది.

మోసపోయానని తెలుసుకున్న ఆమె పెళ్లయిన రెండేళ్ల తర్వాత రోహిత్ రాజ్‌తో విడాకులు తీసుకుంది. నకిలీ రోహిత్ రాజ్ ప్రజలను మోసం చేయడం కొనసాగించాడు దానితో ఆమె అతనిపై ఘజియాబాద్‌లో కేసు నమోదు చేసింది. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.