మోడీ చేపడుతున్న కార్మిక రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేస్తున్న మహా ధర్నాకు మద్దతుగా విజయవాడలో జరుగుతున్న రెండువ రోజు ధర్నాకు రాజమండ్రి నుండి జట్ల సంఘము కార్మికులు, భవన, పేపర్ మిల్, వ్యవ సాయ కార్మికులు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరారు. అంతక ముందు సీ.పీ.ఐ. కార్యాలయము నుండి ప్రదర్శనగా బయలు దేరి వెళ్లారు .
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు , కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం 9ఏళ్ల పాలనలో రైతాంగ సంక్షోభం పెరిగి ప్రతి 20 నిమిషాలకు ఒక రైతు దేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కార్పొరేట్ మోడీ స్నేహితులకు లాభం చేకూర్చేందుకు కార్మికుల హక్కులన్నింటిని తొలగిస్తూ బానిసలుగా మార్చేందుకు 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని విమర్శించారు. తక్షణం రైతులను సంక్షోభం నుంచి బయటపడేందుకు రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26000 తగ్గకుండా నిర్ణయించి చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో సీపీఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్ప రమణ, వ్యవసాయ కార్మిక నేతలు సాగర్, లక్ష్మణ్, రైతు నాయకులు ప్రకాష్, తదితరులు పాల్గున్నారు
మోడీ గద్దె దిగాలంటే ఐక్య పోరాటాలే శరణ్యం… -తాటిపాక మధు, కుండ్రాపు రాంబాబు-

