ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ నెల 16న సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నట్టు వెళ్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడ సి.ఎస్. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ… ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఖరారైన ప్రోగ్రాం ప్రకారం ఈ నెల 16న మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రం చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న తదనంతరం అదే రోజు సాయంత్రం తిరిగి వెళ్ళనున్నారని తెలిపారు.
మోడి జిల్లా పర్యటనపై సి.ఎస్. సమీక్షించిన…!!!

