ఈ మద్య కాలంలో చాలా మంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. వారికోసం ప్రభుత్వం మొబైల్ ట్రాకింగ్ సిస్టంను ప్రవేశపెట్టింది. దీనితో దొంగతనానికి గురయిన ఫోన్లను కనిపెట్టి భాదితులకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో ఆయా ప్రాంతలలో ఇప్పటి వరకూ చోరికి గురయిన 1350సెల్ ఫోన్ లను కాకినాడ పోలీస్ అధికారులు రికవరీ చేశారు. ఆ సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం భాదితులకు అందచేసినట్లు జిల్లా ఎస్.పీ. సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… చోరీ చేయబడిన ఫోన్ లను 5 దశలలో పట్టకున్నామని అన్నారు.
కాకినాడ జిల్లాలో మొబైల్ ఫోన్లు రికవరీ…!!!
