రైల్వే స్టేషన్ లలో చోరీలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు పలు రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న శ్రీను, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేసి వారినుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను, నగదును స్వాధీనం చేసుకున్నామని జీ.ఆర్.పీ. ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ వెళ్లడించారు. ప్రయాణికులనుంచి దొంగతనం చేసిన 9 ఫోన్లను, 2 లక్షల విలువచేసే నగదు పట్టుకొని స్వాధీనం చేసుకునన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తన్నామని ఆయన తెలిపారు.
మొబైల్ చోరీలపై నిఘా… ఇద్దరు అరెస్ట్… !!!

