సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో 17 అంశాల అజెండా కేవలం 20 నిమిషాల్లోపే ముగించడంతో కౌన్సిల్ సమావేశంను మొక్కుబడిగా ముగించారు. సామర్లకోట మున్సిపాలిటీ లో కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ గంగిరెడ్డి, అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. తొలుత వైసీసీ కౌన్సిలర్ పెండ్యాల నాగలక్ష్మి జీరో అవర్ ఇవ్వాలని చైర్ పర్సను కోరారు. ఏమయిన సమస్యలుంటే సమావేశం అనంతరం తన చాంబర్ లో మాట్లాడుకుందామని చైర్ పర్సన్ చెప్పారు. కాగా అజెండాలో మొదటి అంశమయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మున్సిపాల్టీ జనరల్ ఫండ్ నుండి ఖర్చులు చెల్లింపుల ఆంశంపై వైసీపీ కౌన్సిలర్ కరణం రాజ్ కుమార్, టీడీపీ కౌన్సిలు బలుసు వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గత నెలలో వాయిదా వేసిన అంశాన్ని మరలా ఎందుకు ఆమోదిస్తున్నారని వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. దీనితో తాము ఆజెండా అంశాలన్నీ ఆమోదిస్తున్నానని వైస్ చైర్మన్ మోజెసీ ప్రకటించడంతో కౌన్సిలర్లు అందరూ బయటకు వెళ్ళిపోయారు. అజెండా పై చర్చ లేకండా కౌన్సిల్ సాధారణ సమావేశంను ముగించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ జె రామారావు, అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మొక్కుబడిగా జరిగిన కౌన్సిల్ సమావేశం…

