అంబేద్కర్ నగర్ స్టేషన్‌ల మధ్య డబుల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు నైరుతి రైల్వే ప్రకటించింది. ఈ పరిణామం మే 19 నుంచి జూన్ 2 వరకు వివిధ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులపై ప్రభావం చూపనుంది.
మే 21 నుంచి 28 తేదీలలో యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరే వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు, ఇండోర్ మరియు డాక్టర్ అంబేద్కర్ నగర్ స్టేషన్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేయడ జరుగుతుందని తెలిపింది. డాక్టర్ అంబేద్కర్ నగర్‌లో ముగిసే ఈ రైలు ఇప్పుడు ఇండోర్ జంక్షన్‌లో తన ప్రయాణాన్ని ముగించనున్నాయి.

