విజయవాడలో మేమంతా సిద్ధం బస్సుయాత్రలో విషాదం చోటుచేసుకుంది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు రాయితో దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు ఈ రాయి తాకడంతో జగన్ కి తీవ్ర గాయం అయ్యింది. అతని పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు వై.సీ.పీ. నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని పక్కనే ఉన్న ఎం.ఎల్.ఏ. వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయం అయ్యింది. వెంటనే జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆయన మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు.
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో జగన్ పై దాడి…

