ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో సీ.బీ.ఐ. మాజీ జే.డీ. లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ తన మినీ మేనిస్టోను విడుదల చేసిందని వెళ్లడించారు. ఈ మేనిఫెస్టోను ఆయన విద్యార్ధులు, ఆటో డ్రైవర్లు, మహిళలు, రైతుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఓటర్ల దినోత్సవమని ఓటు ప్రాధాన్యతను తెలియజేసే రోజన్నారు. అందువలనే పార్టీ నిర్ణయం మేరకు మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. ఇది ప్రజల్లోనుంచి వచ్చిన మేనిఫెస్టో కాబట్టి దీనిని పీపుల్స్ మేనిఫెస్టో గా పేర్కొన్నారు. దీనిని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాలను, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రూపొందిచినట్లు తెలిపారు.
మేనిస్టోను విడుదల చేసిన జై భారత్ నేషనల్ పార్టీ…

