మెస్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండవ రోజు ఆందోళనలో భాగంగా కాకినాడ జీ.జీ.హెచ్. తల్లి బిడ్డ విగ్రహం సమీపంలో ఉన్న గేటు వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమాంలో సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, మెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వై. శంకర్, ఏ. ఏడుకొండలు మాట్లాడుతూ… గత 30 సంవత్సరాల కాలం నుంచి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు రోగులకు వేడి వేడి ఆహార అందించడంలో మెస్ కార్మికులు ఎంతో శ్రమ పడుతున్నారని అటువంటి కార్మికులకు రెండు నెలల కాలం నుంచి కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు.
గత ఎనిమిది నెలల నుంచి కార్మికుల షేర్ పి.ఎఫ్. వాటాను దాదాపు 7 లక్షల వరకు కట్ చేసుకుని పీ.ఎఫ్. ఖాతాకు జమ చేయకుండా కాంట్రాక్టర్ వద్ద పెట్టుకున్నారని అన్నారు. ఈ కాంట్రాక్టర్ కాలపరిమితి 2024 ఏప్రిల్ నెలతో ముగియనుందని ఈయన కట్ చేసిన సొమ్ము పిఎఫ్ ఖాతాకు జమ చేయకపోతే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వై శ్రీను, ఎస్ శ్రీను, సురేష్, విజయ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మెస్ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి…

