ములుగు మండలంలోని బండారు పల్లి గ్రామం గిరిజన భవన్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయితీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజా సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా అందరు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం లో గ్రామీణ స్థాయి నుండి అభివృద్ధి జరిగే విధంగా క్షేత్ర, మండల, జిల్లా స్థాయి అధికారులు పనిచేయాలని తెలిపింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని ఆదేశించారు.
ములుగు జిల్లా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తాం… -మంత్రి సీతక్క-

