ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు తమ న్యాయమయిన కోరికలను నెరవేర్చమని సమ్మె నిర్వహించి 5వ రోజు చేరుకుంది. ఇందులో భాగంగా సామర్లకోటలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరి, కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేసి జీతం పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి స్టేషన్ సెంటర్ వరకు పట్టణ ప్రజల మద్దతు కోరుతూ భారీ ఊరేగింపును నిర్వహించారు.
ఈ ప్రదర్శనలో అగ్రభాగాన ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ, పెదిరెడ్ల అర్జున్ రావు, సప్త సూరిబాబు తదితరులు విప్లవ గేయాలతో పట్టణ ప్రజలను కార్మికులను ఆకర్షించారు. స్టేషన్ సెంటర్ వద్ద ఏ.ఐ.టీ.యూ.సీ. నాయకులు సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, తదితరులు మాట్లాడుతూ… మున్సిపల్ కార్మిక సమస్యలను ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
