ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాక్టర్‌ను బస్సు ఢీకొనడంతో ఐదుగురు యాత్రికులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు మంగళవారం వెళ్లడించారు. మృతులు వార్కారీలు విఠ్ఠల్ స్వామి భక్తులు ముంబై సమీపంలోని వారి స్వస్థలమైన డోంబివిలీ నుండి ఆషాధి ఏకాదశి వేడుకల కోసం పంఢర్‌పూర్‌కు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో బస్సు ట్రాక్టర్‌ను ఢీకొని వాగులో పడిందని పోలీసు అధికారులు తెలిపారు. డీ.సీ.పీ. వివేక్ పన్సారే విలేకరులతో మాట్లాడుతూ… డోంబివిలీ నుండి మొత్తం 42 మంది ప్రయాణికులు పండర్‌పూర్‌కు వెళ్తుండగా అద్నే గ్రామం సమీపంలో వారి బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టిందన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాక్టర్ బస్సు ఢీ… ఐదుగురు మృతి…
