రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించిన సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన కాకినాడలో 3వ రోజుకి చేరుకుంది. ఇందులో భాగంగా ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. జగన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీను వెంటనే అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 4 నెలల పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలని, పీ.ఎఫ్., ఈ.ఎస్.ఐ అమలుచేయాలని నినాదాలు చేశారు. సమ్మెను నిరోధించే ప్రయత్నం చేయగా పోలీసులు, ఉద్యోగులు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
వెంటనే సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ కలుగజేసుకొని శాంతియుతంగా సమ్మె పోరాటాన్ని నిర్వహిస్తున్న ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించవద్దని పోలీసులకు హితవుపలికారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జే.ఏ.సీ. నాయకులు ఎం. చంటిబాబు, ఏ. లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.
మానవహారం నిర్వహించి ఉద్యోగులు నిరసన…

