ప్రముఖ సామాజికవేత్త సానా సతీష్ బాబు తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామస్తుడు కందికట్ల నూకరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నాణ్యమైన వైద్యాన్ని పొందలేకపోతున్నారనే విషయం తెలుసుకున్న సానా సతీష్ బాబు నూకరాజు వైద్యాన్ని ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు రూ. 50 వేల రూపాయిలు చికిత్స నిమిత్తం సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందజేశారు. నూకరాజు త్వరగా కోలుకొని ఆరోగ్యవంతంగా సాధారణ జీవితం గడపాలని సానా సతీష్ బాబు ఆకాంక్షించారు. సతీష్ బాబు మానవత్వం పట్ల నూకరాజు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న సానా సతీష్ బాబు…

