తెలంగాణ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఒక కారు వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో అనిల్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో యువకుడుకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు వెంటనే భాదితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత భాదితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్తలానికి చేరుకొని, అక్కడ ఉన్న సీ.సీ. కెమెరాల ఆధారంగా కారు యజమానిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై కారు బీభత్సం…

