బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊహించని మరో షాక్ తగిలింది. ఈడి ఆమెను అరెస్ట్ చేసిన్నట్లు బహిర్గతంచేసింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది.తనిఖీల సమయంలో ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదని తెలిపారు. ఈ క్రమంలో కవిత రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు సమాచారం. మరోవైపు, కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
మాజీ సీ.ఎం. కేసిఆర్ కూతురు కవిత అరెస్ట్…

