ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో బి.ఆర్.ఎస్. పార్టీ కు చేందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అలియాస్ సాహిల్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎవరు తీసుకున్న గోతులో వారే పడినట్టు రహీల్ ను కాపాడబోయి పదిహేను మంది వెళ్లాల్సిన పరిస్తితి వచ్చింది. మాజీ ఎమ్మెల్యేతోపాటు ఇద్దరు సీ.ఐ.లు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే కుమారుడును తప్పించబోయి 15 మంది బలి…
