కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని బెల్తంగడి హైవే పక్కన ఆగున్న వేన్ ను అటువైపు వేగంగా వెళ్తున్న ఒక కారు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అక్కడ నిలబడి ఉన్న మహిళను కూడా ఆ కారు ఢీ కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని భాదితురాలుని సమీప ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి లో చికిత్స పొందుతుందని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఆ కారు డ్రైవర్ పై కేసు నమోదుచేసారు.

