రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ బి.ఎస్.పి. మంగళవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వారణాసి లోక్‌సభ స్థానంతో సహా 11 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఎస్పీ ప్రధాని మోదీపై అథర్ జమాల్ లారీని రంగంలోకి దించింది. లారీతో పాటు బరేలీ నుంచి ఛోటేలాల్ గంగ్వార్, ఘాజీపూర్ నుంచి ఉమేష్ కుమార్ సింగ్‌ను బరిలోకి దింపిన పార్టీ మైపురి స్థానానికి అభ్యర్థిని మార్చి శివప్రసాద్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోకూడదని బీఎస్పీ నిర్ణయించింది. బదులుగా రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం ఐ.ఎన్.డీ.ఐ. కూటమికి సవాలుగా నిలిచింది, అనేక స్థానాల్లో ఓట్లను విభజించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల సమాచరం. ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతాయి.

