గౌతమీ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన వైష్ణవి సూర్య తన క్రీడా నైపుణ్యంతో 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ క్రీడలకు ఎంపిక అయ్యిందని టేబుల్ టెన్నిస్ కోచ్ వి.టి.వి. సుబ్బారావు తెలియజేశారు. తను 2024 జనవరి13 నుండి 19 వరకు మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహింపబడు 67వ స్కూల్ నేషనల్ అండర్ 19 బాలికల టేబుల్ టెన్నిస్ క్రీడల జట్టు పాల్గొనుందని తెలిపారు. ఆమె రాష్ట్రంలో జరిగిన క్రీడలో ఆడి తన నైపుణ్యంతో ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు.
అంతేకాకుంగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా అండర్ 19 బాలికల జట్టుకు ఆమె కెప్టెన్ గ ఎంపిక అయ్యిందని వెళ్లడించారు. ఈ సందర్బంగా తూర్పు గోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వనాధం, భాస్కర రామ్, అధ్యక్షులు జె.వి. అప్పారెడ్డి, కోశాధికారి సత్యనారాయణ, భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ, తదితరులు అమెను అభినందనలతో ముంచ్చెత్తారు.

