Trending News

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం పెంచాలి…

WhatsApp Image 2024-02-05 at 4.28.21 PM (1)

కాకినాడ డీ.ఈ.వో. ఆఫీసు వద్ద సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించి ఆర్.జే.డీ. కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పదివేల రూపాయలు వేతనం చెల్లిస్తాననిఇచ్చిన హామీను మరిచి పోయారన్నారు.

ఈ ఐదేళ్ల కాలంలో నిత్యవసర ధరలు భారీగా పెరిగాయన్నారు. కార్మికుల వేతనాలు గానీ, విద్యార్థికి ఇచ్చే మెనూ చార్జీలు గాని రాష్ట్ర ప్రభుత్వం పెంచకుండా ఉంటే ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేసారు. నెలల తరబడి బిల్లులు పెండింగులు పెడుతుండడంతో వంటకోసం వేలాది రూపాయలు అప్పులు చేసి తీర్చలేక కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను తక్షణమే 20 రూపాయలకు పెంచాలని, కార్మికులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని, సకాలంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి మంగ, కడియాల లక్ష్మి, దేవుడమ్మ, కరకు సుబ్బలక్ష్మి, పకృతి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్